Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

మూడో టెస్టు: భారత్ 329/6

                       Shikhara-and-Rahul

పల్లెకెలె: వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న ఆఖరిదైన మూడో టెస్టులో మొదటి రోజు భారత్ ఆరు వికెట్లు  కోల్పోయి 329 పరుగులు చేసింది.  టీమిండియా ఓపెనర్లు చెలరేగిపోయారు. ఓపెనర్ శిఖర్ ధావన్ 107 బంతుల్లో 16 బౌండరీలతో శతకం(103) నమోదు చేశాడు. తొలి వికెట్ కు శిఖర్, రాహుల్ జోడి ఏకంగా 188 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. అనంతరం రాహుల్ వ్యక్తిగత స్కోర్ 85 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఆ తరువాత కొద్దిసేపటికే సెంచరీ చేసిన ధావన్ 119 పరుగులు చేసి పుష్పకుమార బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఛటేశ్వరా పూజారా (8), విరాట్ కోహ్లి (42), అజింక్య రహానే (17), రవిచంద్రన్ అశ్విన్ (31) పరుగులు చేసి ఔటయ్యారు. వృద్ధిమాన్ సాహా (13), హార్దిక్ పాండ్యా(1) బ్యాటింగ్ చేస్తున్నారు. శ్రీలంక బౌలర్లలో మలింద పుష్పకుమార్ మూడు వికెట్లు, లక్ష్యన్ సందకాన్ రెండు వికెట్లు, ఫెర్నాండో ఒక వికెట్ తీశారు.  ఇప్పటికే భారత్ రెండు టెస్టులు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టెస్టుల్లో రాహుల్ వరసగా ఏడు హాఫ్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు.

Comments

comments