Search
Tuesday 17 October 2017
  • :
  • :
Latest News

ఇంట్లోనే పోల్ డ్యాన్స్

Jaqline

శ్రీలంక నుంచి వచ్చి బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిలైన బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్. సూపర్ ఫిజిక్‌తో కనిపించే ఈ భామ సినిమాల్లో అందాలు ఆరబోయడానికి ఏమాత్రం వెనుకాడదు. దీంతో బాలీవుడ్‌లో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చేస్తున్నాయి. తన లేటెస్ట్ సినిమా ‘ఎ జెంటిల్‌మన్’ కోసం జాక్విలిన్ పోల్ డ్యాన్స్ నేర్చేసుకుంది. సినిమాలోని ఒక పాటలో పోల్ డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించబోతోంది.
మొదటి నుంచి ఈ భామ ఫిట్‌నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటోంది. దీంతో పోల్ డ్యాన్స్ వల్ల తన ఫిట్‌నెస్ మరింత పెరుగుతుందని రెగ్యులర్‌గా ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోందట. తన ఇంట్లోనే పోల్‌ను ఏర్పాటుచేసుకొని ప్రతిరోజు ఆమె పోల్ డ్యాన్స్ చేస్తుండడం విశేషం. ఇక సినిమాలోని చంద్రలేఖ… పాటలో జాక్విలిన్ పోల్ డ్యాన్స్‌తో తన అందాలను ఆరబోస్తుందట. ఈ పాట సినిమాకే హైలైట్‌గా ఉంటుందట.

Comments

comments