Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

కోటిన్నర వ్యూస్ సాధించిన వైరల్ వీడియో….

Man-Muscle-Cramp

కాలిఫోర్నియా: కాలిఫోర్నియాకు చెందిన ఏంజెల్ బెర్ముడెజ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేసిన 50 సెకన్ల నిడివి గల ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియో కోటిన్నర వ్యూస్ సాధించింది. ఇంతా భారీ మొత్తంలో వ్యూస్ సాధించిన ఈ వీడియోలో ఏముందనేగా మీ అనుమానం. ఈ వీడియోలో సదరు వ్యక్తి కాలి కండరాలలో ఏదో జీవి దూరినట్లు అనిపిస్తోంది. ఈ వీడియో చూసిన కొందరైతే అతడి కండరాల్లో ఏలియన్ దూరి ఉంటాదన్నారు.

అసలు విషయం ఏమిటంటే…. బెర్ముడెజ్ వ్యాయమాశాలలో వ్యాయమాలు చేసి వస్తున్న సమయంలో ఉన్నటుండి అతడి కాలి కండరాలు పట్టేశాయి. అతడు ఆ బాధతో కాసేపు విలవిల్లాడిపోయాడు. ఆ సమయంలో వేరే వ్యక్తి తీసిన వీడియోను బెర్ముడెజ్ సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో తెగ హల్ చల్ చేస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోను ఇప్పటి వరకు ఏకంగా కోటిన్నర మంది వీక్షించారు. ఆ వీడియో మీ కోసం…

Comments

comments