Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

మెరుగైన సేవలు అందిస్తున్నాం: లక్ష్మారెడ్డి

                     Lakshma-Reddy

హైదరాబాద్: భారతీయ సంస్కృతి, సంప్రదాయలలో భాగంగా అనేక వైద్య చికిత్సా విధానాలు పరంపరంగా వస్తున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో అసోషియోషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…. చికిత్సా విధానాలు వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయన్నారు. సిఎం కెసిఆర్ నిర్దేశంలో ప్రజలకు మెరగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. అన్ని ఆస్పత్రులో రోగులకు సదుపాయాలు కల్పించామని తెలిపారు. కానీ ప్రస్తుతం వేగంగా మార్పులు చెందుతున్న సమాజంలో ఏ ఒక్క విధానం మాత్రమే పూర్తిగా ప్రజలకు స్పస్టత ఇవ్వలేకపోతుందని వివరించారు. ప్రత్యామ్నాయ విధానాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచమంతా యోగా మీద దృష్టి సారించిందన్నారు. రోగాలు రాకుండా నిరోధించడం, రోగ నిరోధక శక్తిని పెంచడం వంటి పలు అంశాల్లో యోగా ప్రక్రియ బాగా పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

Comments

comments