Search
Monday 21 August 2017
  • :
  • :
Latest News

ఆరు నెలల్లో పూర్తవుతుందట

prabhas

‘బాహుబలి’ కోసం చాలా సమయాన్ని కేటాయించిన ప్రభాస్ ఇకపై చకచకా సినిమాలు చేసేస్తాడని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్టే ‘బాహుబలి-2’ రిలీజ్ సందర్భంగా థియేటర్లలో తన కొత్త సినిమా ‘సాహో’కు సంబంధించి ఓ చిన్న టీజర్‌ను రిలీజ్‌చేశాడు ప్రభాస్. ఇట్స్ షో టైమ్.. అంటూ విడుదలైన ఈ సినిమా టీజర్ అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా ‘సాహో’కు సంబంధించి పెద్దగా అప్‌డేట్స్ లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఒకింత డీలాపడ్డారు. అప్పుడప్పుడు ప్రభాస్‌కు సంబంధించిన డిఫరెంట్ గెటప్‌లు బయటకొస్తుండడంతో ఇవన్నీ ‘సాహో’ కోసమేనని అభిమానులు భావించారు. కానీ ప్రభాస్ గెటప్ విషయమై ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని… ప్రభాస్ లేకుండానే కొన్ని రోజులు షూటింగ్ జరిపేశామని ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ మదిరాజు గంగాధరన్ ఎలియాస్ మది తెలియజేశాడు. అతి త్వరలో ప్రభాస్ షూటింగ్‌కు హాజరవుతాడని… ఏకబిగిన ఆరు నెలల్లో ‘సాహో’ షూటింగ్ పూర్తయిపోతుందని ఆయన ప్రకటించడం గమనార్హం. అదేగనుక జరిగితే ప్రభాస్ అభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంటుంది. ఓవైపు సినిమా నిర్మాణం, ఇంకోవైపు విజువల్ ఎఫెక్ట్ వర్క్ వెరసి ‘సాహో’చిత్రం శరవేగంగా నిర్మాణం పూర్తిచేసుకుంటుందట. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాకపోవడం గమనార్హం.

Comments

comments