Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

పాక్ రేంజర్ల కాల్పులు : మహిళ మృతి

Pak-Rangers

శ్రీనగర్ : పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని మెంధార్ సెక్టార్‌లో శనివారం ఉదయం పాక్ సేనలు భారత భూభాగంపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో రక్వియా బేగం అనే మహిళ మరణించింది. పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంది. గత కొంతకాలంగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కూడా భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పాక్ సరిహద్దుల్లో భారత బలగాలుగా భారీగా మోహరించాయి.

Pak Rangers firing : woman killed

Comments

comments