Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

భైంసా ప్రభుత్వాస్పత్రి ముందు ఉద్రిక్తత

                   Strike

నిర్మల్: భైంసా ప్రభుత్వాస్పత్రి ముందు శనివారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటుచేసుకుంది. శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ బాబు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే తమ బాబు ప్రాణాలు తీసిందని బంధువులు ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ వైద్యులు మూకుమ్మడిగా సెలవుల పెట్టారు. వైద్యులు లేకపోవడంతో ఆస్పత్రి ముందు రోగుల బంధువులు ఆందోళన చేపట్టారు. ఆందోళనకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలపడంతో టిఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.

Comments

comments