Search
Monday 21 August 2017
  • :
  • :
Latest News

టీచర్ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు

Teacher

17న తుది నిర్ణయం 

హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. టీచర్ పోస్టులకు సంబంధించిన అర్హతలు, విధివిధానాలు రూపొందించి వారం రోజుల్లో టిఎస్‌పిఎస్‌పికి అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీ పాత జిల్లాల ప్రకారమా.? లేక కొత్త జిల్లాల ప్రకారమా..? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. శుక్రవారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ ఉన్నతాధికారులతో టీచర్ పోస్టుల భర్తీపై సమీక్షించారు. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత న్యాయ వివాదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా జిల్లాల విషయంపై న్యాయశాఖ సలహా తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్‌సిటిఇ నిబంధనల ప్రకారమే అర్హతలు పొందుపరచాలని, ఈ విషయంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పక్కాగా నియమ నిబంధనలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ నెల 17న మరోసారి సమావేశం నిర్వహించి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు తెలిసింది.

నెలాఖరులో నోటిఫికేషన్..?
రాష్ట్రంలో 8,792 టీచర్ పోస్టుల భర్తీకి ఈ నెలాఖరులో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సె ప్టెంబర్ 11వ తేదీలోగా ఈ పోస్టులు భర్తీ చేస్తామని విద్యా శాఖ సుప్రీంకోర్టుకు తెలిపిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగానే నోటిఫికేషన్ జారీ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా టీచర్ పోస్టుల నియామకాలు కొత్త జిల్లాల ప్రాతిపదికన చేపట్టాలా..? లేక పాత జిల్లాల ప్రకారం చేపట్టాలా అనే విషయంపై స్పష్టత వస్తే వెంటనే టిఎస్‌పిఎస్‌సికి ఇండెంట్ పంపించనున్నారు. ఏ జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలనే విషయంపై న్యాయ నిపుణులు, ఇతర విభాగాలతో సంప్ర దింపులు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసినా సెప్టెంబర్ 11లోగా నియామకాల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం మాత్రం లేదు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పరీక్షల నిర్వహణకు కనీసం 40 రోజులు తగ్గకుండా గడువు ఉండాలి. ఉపాధ్యాయ నియామకాల ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడం కావడానికి కనీసం మూడు నెలలు పట్టే అవకాశం ఉంటుంది.

Comments

comments