Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

ఒక్క రూపాయి మాఫీ లేదు

 డొల్ల కంపెనీలపై త్వరితగతిన చర్యలు  

 ఆర్థిక సర్వే సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ

FM

న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థలు తీసుకున్న రుణాల్లో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయబోమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. దీనిపై ప్రతిపక్షాలు మాట్లాడే ముందు వాస్తవాలు తెల్సుకోవాలని అన్నారు. అదేసమయంలో డొల్ల కంపెనీల(షెల్)పై వేగవంతంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కంపెనీల చట్టం ప్రకారం డొల్ల కంపెనీలకు ఒక నిర్వచనమంటూ లేదని, అయితే అవి నగదు తరలింపులో ఉపయోగపడుతున్నాయని అన్నారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.
డొల్ల కంపెనీల వెనక ఉన్న అసలు యజమానులను గుర్తించి ఆదాయపు పన్ను, బినామీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానిత షెల్ కంపెనీల ట్రేడింగ్‌కు వ్యతిరేకంగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చర్యలు చేపట్టడంపై మంత్రి స్పందిస్తూ, స్టాక్‌మార్కెట్లలో కొంత సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. మరోవైపు డొల్ల కంపెనీల నియంత్రణకు కంపెనీల చట్టాల్లో మార్పులేమైనా చేస్తారా? అని ప్రశ్నించగా జైట్లీ అలాంటిదేమీ లేదని అన్నారు. సరళతర వ్యాపారంలో భాగంగా రెండు రోజుల్లోనే కంపెనీలు రిజస్టర్ అవ్వడానికి అవకాశం ఉండాలని, అదే సమయంలో అవి దుర్వినియోగానికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. దీనికి గాను కొంత సమన్వయం అవసరమని, సాంకేతికతతో అదేమీ పెద్ద సమస్య కాదని పేర్కొన్నారు. కాగా శుక్రవారం ఆర్థిక సర్వే 2016-17ను జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. పుంజుకుంటున్న రూపాయి విలువ, వ్యవసాయ రుణాల రద్దు, జిఎస్‌టి అమలు తదితర సవాళ్ల కారణంగా గతంలో అంచనా వేసిన 6.75-7.5 శాతం వృద్ధిని సాధించడం చాలా కష్టమవుతుందని సర్వే వెల్లడించింది. ప్రధానందా జిఎస్‌టిలో నిర్మాణాత్మక సంస్కరణలు, నోట్ల రద్దు వంటి అంశాలను చర్చించింది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ సహా పలు అంశాలను నివేదిక ప్రతిపాదించింది. దేశ ఆర్ధికవ్యవస్థ ప్రస్తుత స్థితి, మొత్తం వాణిజ్యం, బాహ్య రుణం, ఎఫ్‌డిఐ కింద విదేశీ నిధుల ప్రవాహం తదితర అంశాలపై నివేదికలో ఆర్థిక సర్వే పేర్కొంది.

Comments

comments