Search
Monday 23 October 2017
  • :
  • :
Latest News

యూజర్లకు ఆర్‌కాం అద్దిరిపోయే ఆఫర్!

Reliance-Communications

ముంబయి : టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు యూజర్లకు సరికొత్త ఆఫర్లను అందిస్తూనే ఉంది. అయితే జియో పోటీని తట్టుకొనేందుకు మిగితా టెలికాం సంస్థలు కూడా వివిధ రకాల ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే కొవలో అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ కమ్మూనికేషన్స్ (ఆర్‌కాం) ఓ సరికొత్త ఆఫర్ ని తీసుకొచ్చింది. కేవలం రూ.299కే అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్, డేటా అందిస్తున్నట్లు ఆర్‌కాం ప్రకటించింది. ” రిలయన్స్‌ మొబైల్‌ ఇప్పటివరకు అత్యంత చౌకైన రేట్లను ప్రవేశపెట్టింది. 299 రూపాయలతో నెలవారీ రెంటల్‌ ప్లాన్‌ను ప్రారంభింస్తోంది” అని ఆర్‌కామ్‌ ట్వీట్‌ చేసింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఆర్‌కామ్‌ పేర్కొనలేదు.

Comments

comments