Search
Monday 11 December 2017
  • :
  • :

ఎల్ఐసిలో 264 ఉద్యోగాలు

LIC-HFL

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్)లో తాజాగా 264 ఉద్యోగాల భర్తీకి సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 100 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులుండగా, 164 అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. తెలంగాణకు 5 అసిస్టెంట్ పోస్టులుండగా, ఎపికి 11 అసిస్టెంట్ పోస్టులున్నాయి.

విద్యార్హతలు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంబిఎ, అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ అర్హతగా పేర్కొన్నారు.

వయసు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21-28 ఏళ్లు, అసిస్టెంట్ పోస్టులకు 21-28 ఏళ్లు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభ తేదీ ఆగస్టు 24, చివరి తేదీ సెప్టెంబర్ 7. ఆన్ లైన్ రాత పరీక్షలు:-  అసిస్టెంట్ మేనేజర్- అక్టోబర్ 10, అసిస్టెంట్- అక్టోబర్ 12న ఉండనుంది.

దరఖాస్తు రుసుం: రూ. 500

ఎంపిక విధానం: ఆన్ లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ.

ఇతర వివరాలతో పాటు దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ సైట్ www.lichousing.com లో చూడవచ్చు.

Comments

comments