Search
Wednesday 21 February 2018
  • :
  • :

భారత ఆర్మీలోకి రోబో వెపన్స్

ROBOT

ఢిల్లీ : భారత ఆర్మీలోకి ఇక రోబో వెపన్స్ రాబోతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో రాళ్ల దాడులు, ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు భారత్ సైన్యానికి రోబోలు సహకరించనున్నాయి. అల్లరి మూకల విధ్వంసాలను అదుపు చేసే క్రమంలో సైనికులు అనేక కష్టనష్టాలకు గురవుతున్నారు. వారి కష్టనష్టాలను తగ్గించేందుకు రోబోటిక్ వెపన్స్‌ను ప్రవేశపెట్టాలని భారత సైన్యం భావిస్తోంది. తమకు 544 రోబోలు కావాలని సైనిక అధికారులు పంపిన నివేదికను భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఏడు మాసాలుగా డిఆర్‌డివొ లేబొరేటరీ ఈ ప్రాజెక్టుపై పని చేస్తున్నట్టు తెలిసింది. పలు కీలక స్థావరాల వద్ద ఈ రోబోటిక్ వెపన్స్‌ను మోహరించేందుకు చర్యలు తీసుకోనున్నారు.

Robot Weapons into the Indian Army

Comments

comments