Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

తల్లిదండ్రులకు శాస్త్రీయ అవగాహన తప్పనిసరి

                     Paren-Beat-our-Children

జీవితం నల్లేరు మీద బండి నడక కాదు. ఇంచు మించు ప్రతికుటుంబంలోనూ సమస్యలు వుంటా యి. కొన్ని తీవ్రమైన స్థాయిలో వుంటాయి. మరికొన్ని స్వల్పంగా వుంటాయి. స్వల్ప సమస్యలను పరిష్కరించ టం సులభం. ఒక్కోసారి ఆయా సమస్యలు వున్నాయని పిల్లలు గుర్తించే లోపే వాటిని తల్లిదండ్రులు పరిష్కరించ డం జరుగుతుంది. కాగా, తీవ్రమైన కలతలు కారణంగా నే అసలు సమస్యలు ఏర్పడతాయి. పిల్లల పెంపకం సమస్యాత్మకంగా మారుతుంది. ఎప్పటికీ తెగని సమస్య లు కలిగిన కుటుంబాల నుండి వచ్చిన పిల్లలు అనేక మానసిక, సామాజిక సర్దుబాటు లోపాలను కల్గివుం టారు. వీటి విషయంలో తల్లిదండ్రులకు శాస్త్రీయ అవగాహనలేని కారణంగా కూడా సమస్యలు మరింత జటిలం అవుతాయి. అటువంటి కుటుంబాలను సమ స్యాత్మక కుటుంబాలుగా సామాజికవేత్తలు పరిగణిస్తారు. కుటుంబ సభ్యుల భౌతిక మానసిక ఉద్వేగ అవసరాలను తీర్చలేని కుటుంబాలు ఇవి. ఈ కుటుంబాలు సమస్యాత్మక కుటుంబాలుగా మారడానికి అనేక కారణాలు వుంటాయి. కొన్ని కారణాలకు పరస్పరం సంబంధం కూడా వుంటుంది.

నిరాదరణ : కుటుంబం పిల్లల సామాజికీకరణలో ముఖ్యపాత్ర పోషిస్తుందనటంలో సందేహం లేదు. బయ టిప్రపంచంలో ఎలా నడుచుకోవాలో మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం కుటుంబం బాధ్యత. ఉత్తమమైన సామాజికీకరణను పిల్లల్లో స్థాపితం కావడానికి కుటుంబంలో వారికి కావాల్సిన ప్రేమ సంరక్షణ అందివ్వవల్సి వుంటుంది. అయితే, చాలా కుటుంబాలలో ఇక్కడ ఉదాసీనత చోటు చేసుకుంటుంది. విచారకరమైన విషయం ఏమిటంటే ప్రేమాదరణలు పంచి ఇవ్వాల్సిన వ్యక్తులనుండే పిల్లల కు నిరాదరణ ఎదురవుతున్నది. ఇది పిల్లలు ఎదురుచూడని వంచన. ఈ నిరాదరణ 1) పిల్లల్ని కొట్టడం 2)లైంగిక వేధింపులు 3)ఉద్వేగ భంగపాటుకు గురిచేయడం 4) సూటిపోటి మాటలతో గాయపర్చడం అని నాలుగురకాలుగా వుంటుంది. వీటిలో ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులను చీటికిమాటికి పిల్లల్ని కొట్టడం చేస్తుంటారు. దీని గురించి తెలుసుకుందాం.

పిల్లల్ని కొట్టడం : ఒక కుటుంబంలో పిల్లల్ని కొట్టడం అనేది ఒక సమస్యగా పరిగణించడమే అరుదు. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలనే ధ్యాసలో ఇది ఒక్కోసారి మోతాదును మించుతుంది. శారీరకంగా చేయి చేసుకోవడం తల్లిదండ్రులు చాలా అలవోకగా చేసే చర్య. ఏ చిన్న తప్పు చేసినా వారి మీద చేయి చేసుకోవడం చాలా మామూలు విషయం. దీనిని ఒక సమస్యగా పరిగణించే అలవాటు ఎవరికీ వుండదు. తల్లిదండ్రులు సాధారణంగా తమ కోపతాపాలకు పిల్లల్నే టార్గెట్‌గా ఎంచుకుంటారు. కుటుంబాన్ని నడిపే క్రమంలో వారికి ఎదురయ్యే ఆవేశాలను, వ్యాకులతను పిల్లలపై ప్రదర్శిస్తారు. పిల్లలు దారితప్పుతారనే బెంగతో కొంతమంది మరీ కఠినంగా క్రమశిక్షణ నిబంధనలను అమలు చేస్తారు. ఇది పిల్లల పాలిట నరకం అవుతుంది. ఆదరణ పూర్వకంగా చెప్పాల్సిన విషయాలను కూడా కొట్టి చెప్పడం అలవాటుగా కలిగిన కుటుంబాలలో పిల్లలు చిన్నప్పట్నుంచి, దెబ్బలు తింటారు. ఇది వారి ఎదుగుదలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

పిల్లల్ని కఠినంగా చూడడం, చండశాసనుడిలా చూడడం వల్ల పిల్లల్లో క్రమంగా మొండితనం ఏర్పడుతుంది. శారీరకంగా మోతాదుకు మించి చేయిచేసుకోవడం వారిలో బ్యాటర్డ్ చిల్డ్రన్ సిండ్రోమ్ అనే మానసిక వ్యాధికి కారణమవుతుంది. తరచుగా దెబ్బలు తినడానికి గురైన పిల్లలు, పలు విషయాల్లో వ్యతిరేక భావాలను కలిగివుంటారు. వారిలో భంగపాటు ఒక అలవాటుగా మారిపోతుంది. స్పందన కరువై, సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయాలలో కూడా తగిన ప్రతిచర్యలను చేపట్టలేని స్థితికి చేరుకుంటారు. తరువాతికాలంలో ఇది మరీ సమస్యాత్మకంగా ఎదురవుతుంది. చివరకు తల్లిదండ్రులు అనుమానించినట్టే క్రమశిక్షణ లేని పిల్లలుగా తయారవుతారు. వీరికి సర్దుబాటు లోపాలు చాలా వుంటాయి. నిర్ణయాత్మకత కొరవుతుంది. తమకు మంచి చేసేది ఏమిటో చేయనిది ఏమిటో తేడా గుర్తించలేని స్థితిలో పడిపోతారు. జీవితం పట్ల చక్కని దృక్పథాన్ని ఏర్పరచుకోవడంలో కూడా వీరికి సమస్యలు ఎదురవుతాయి.

Comments

comments