Search
Monday 21 August 2017
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మహ్మద్ ఖలీల్ దుర్మరణం

SI-Mohmed

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ – హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్ పైన వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొనడంతో ఎస్ఐ మృతి. కార్ లో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా హస్పిటల్ కు తరలించారు. ఎపి పోలీస్ అకాడమీ(అప్ప)లో డిపార్టమెంటల్ ట్రైనింగ్ కోసం వచ్చిన ఎస్ఐ మహ్మద్ ఖలీల్ (44) వరుస సెలవులు రావడంతో వికారాబాద్ కు బయలుదేరాడు. కారులో ఆయనతోపాటు పలువు ప్రయాణిస్తున్న కారు వర్షం కారణంగా మార్గం మధ్యలో చెట్టుకు ఢీకొంది దీంతో ఎస్ఐ మహ్మద్ ఖలీల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఖలీల్ వికారాబాద్ స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

SI-Mohmed2

గుండమల్ లో విషాధఛాయలు: ఎస్ఐ మహ్మద్ ఖలీల్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు ఆయన స్వగ్రామమైన మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలం గుండమల్ లో విషాధ చాయలు అలుముకున్నాయి. పేద కుటుంబంలో జన్మించిన మహ్మద్ ఖలీల్ ఎంతో కష్టపడి చదువుకుని ఎస్ఐ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడని బంధువులు తెలిపారు. ఖలీల్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Comments

comments