Search
Wednesday 21 February 2018
  • :
  • :

పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

Harish-Rao

సిద్ధిపేట : పేదల ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్ధిపేట ఆస్పత్రిని శనివారం ఆయన సందర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో గర్భిణీలకు అవసరం లేకున్నా పెద్దాపరేషన్లు చేస్తున్నారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీలైనంత వరకు సాధారణ ప్రసవాలు చేయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట ఆస్పత్రిలో వారం రోజుల్లో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఆస్పత్రిలో రోగులతో పాటు వారితో వచ్చే వారికి ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Special focus on Poor People health : Harishrao

Comments

comments