Search
Sunday 25 February 2018
  • :
  • :

సందీప్ కిషన్ క్యూట్ లవ్ స్టోరీ

sundeep-kishan

సందీప్‌కిషన్  నటించిన ‘నక్షత్రం’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి అతన్ని నిరాశపరిచింది. గత కొంతకాలంగా సరైన సక్సెస్‌లేక ఈ యంగ్ హీరో సతమతమవుతున్నాడు.  కెరీర్ ప్రారంభంలో సందీప్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ వంటి కామెడీ మూవీతో మంచి హిట్‌ను అందుకున్నాడు. ఆతర్వాత లవ్ స్టోరీస్ సినిమాలతో వచ్చి పర్వాలేదనిపించాడు. అనంతరం వచ్చిన సినిమాలన్నీ సందీప్‌ను నిరాశపరిచాయి. అయితే తెలుగులో అతని పరిస్థితి ఇలా ఉంటే తమిళ్‌లో మాత్రం ఈ యంగ్ హీరో పర్వాలేదనిపిస్తున్నాడు. అతనికి అక్కడ మంచి మార్కెట్ కూడా ఉంది.  ప్రస్తుతం సందీప్ కిషన్ సూపర్ స్టార్ మహేష్ అక్కయ్య మంజుల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది ఓ కొత్త తరహా లవ్ స్టోరీ సినిమా అని తెలిసింది. అతనికి జోడీగా అమైరా దస్తూర్, త్రిధా చౌదరిలు నటిస్తున్నారు. ఈ సినిమా ఒక క్యూట్ లవ్‌స్టోరీ అని… తప్పకుండా ఇది ప్రేక్షకులకు నచ్చుతుందని చెబుతున్నాడు సందీప్ కిషన్. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మహేష్ చిత్రం ‘స్పైడర్’ రిలీజ్ రోజైన సెప్టెంబర్ 27న విడుదల చేస్తారట దర్శకురాలు మంజుల.

Comments

comments