Search
Thursday 22 February 2018
  • :
  • :

పంతుళ్లు రారు.. పాఠాలు చెప్పరు

Govt-School

బెజ్జూర్: బెజ్జూర్ మండలంలోని అర్కగూడ , వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యావలంటీర్లు పాఠశాలలకు డుమ్మాలు కొట్టడంతో విద్యార్థులు ఆటలకే అంకితం అవుతున్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడంతో వివిలతోనే విద్యావ్యవస్థ కొనసాగుతుంది. విద్యావలంటర్‌లను నియమిం చారు కానీ కొందరు మాత్రమే పాఠశాలలకు వెళ్లడం, అందులో వంతుల వారీగా వెళ్లడం వివిధ పాఠశాలల్లో కొనసాగుతుంది.

అర్కగూడ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కూడా సరి గా నిర్వహించకపోవడం, పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుండి గుడ్లు అందించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వారానికి రెండు రోజులు పౌష్టికాహారం గుడ్లు పె ట్టాలని మెనూలో ఉన్నప్పటికీ అది అందని ద్రాక్షలా మారింది. అధికారుల పర్యవేక్షణలోపం తో పాఠశాలకు ఉపాధ్యాయులు సరిగా హాజరుకాకపోవడం, మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెట్టకపోవడం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Teachers didn’t comes regularly to Govt schools then student loss their Education.

Comments

comments