Search
Tuesday 19 June 2018
  • :
  • :

ధావన్ సెంచరీ

Dhawan

పల్లెకెలె: వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న ఆఖరిదైన మూడో టెస్టులో టీమిండియా ఓపెనర్లు చెలరేగిపోయారు. ఓపెనర్ శిఖర్ ధావన్ 107 బంతుల్లో 16 బౌండరీలతో శతకం(103) నమోదు చేశాడు. తొలి వికెట్ కు శిఖర్, రాహుల్ జోడి ఏకంగా 188 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. అనంతరం రాహుల్ వ్యక్తిగత స్కోర్ 85 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఆ తరువాత కొద్దిసేపటికే సెంచరీ చేసిన ధావన్ 119 పరుగులు చేసి పుష్పకుమార బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్ మూడో టెస్టుల్లోనూ భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(3), పుజారా(7) ఉండగా… భారత్ స్కోర్: 223/2.

Comments

comments