Search
Tuesday 17 October 2017
  • :
  • :
Latest News

అశోక వనంలో భారత ఆటగాళ్ల సందడి

team-india

క్యాండి: టీమిండియా ఆటగాళ్లు శుక్రవారం క్యాండి సమీపంలోని అశోక వనాన్ని సందర్శించారు. రావణసురుడు సీతమ్మను అపహరించి ఇక్కడి అశోక వనంలో ఉంచాడని పురాణాల్లో ఉంది. ఈ ప్రదేశా న్ని భారతీయులు వేలాది సంఖ్యలో సందర్శిస్తుంటారు. కాండి సమీపంలో ఈ క్షేత్రం ఉంది. కాగా, టీమిండియా ఆటగాళ్లు మహ్మద్ షమి, ఉమేశ్ యా దవ్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, కెఎల్.రా హుల్, వృద్ధిమాన్ సాహా తదితరులు ఈ అశోక వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడ దిగిన ఫొటోలను షమి, ఉమేశ్ యాదవ్‌లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, వనం నిర్వాహకులు భారత ఆటగాళ్లకు ఇక్కడి విశేషాలను వివరించారు. ఈ వనంలో హనుమంతుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇదిలావుండగా మూడో టె స్టుకు వేదికగా నిలుస్తున్న కాండి నగరానికి సమీపంలో ఈ అశోక వనం ఉంది. సీత ఎలియా గ్రామం లో ఉన్న ఈ క్షేత్రాన్ని ప్రతి రోజుల వందలాది మం ది భక్తులు సందర్శిస్తుంటారు.

Comments

comments