Search
Wednesday 21 February 2018
  • :
  • :
Latest News

కెన్యా అధ్యక్షునిగా కెన్యట్టా

Kenyatta

కెన్యా : కెన్యా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కెన్యా అధ్యక్షునిగా ఉహురు కెన్యట్టా రెండోసారి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కెన్యట్టా 54.27 శాతం ఓట్లను సాధించి విజేతగా నిలిచారు. ఆయన ప్రత్యర్థి రైలా ఓడింగాకు 44.27 శాతం ఓట్లు వచ్చాయి. తనపై నమ్మకం ఉంచి మరోమారు గెలిపించిన కెన్యా ప్రజలకు అధ్యక్షుడు కెన్యట్టా కృతజ్ఞతలు తెలిపారు. దేశాభివృద్ధికి అంకితభావంతో పని చేస్తానని ఆయన తెలిపారు. దేశ నిర్మాణంలో కలిసి రావాలని ఆయన ప్రత్యర్థి వర్గాన్ని కోరారు. ఓట్ల లెక్కింపుపై తమ ఫిర్యాదులను ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకోలేదని ఆరోపిస్తూ ఓడింగాకు చెందిన జాతీయ మహా కూటమి అధ్యక్ష ఎన్నికల ఫలితం ప్రకటించే కార్యక్రమాన్ని బహిష్కరించింది.

Uhuru Kenyatta wins Kenya presidential election by a hair

Comments

comments