Search
Tuesday 17 October 2017
  • :
  • :
Latest News

మాట తప్పితే కాలర్ పట్టుకోండి: జగన్

                        YS-Jagan

ఆంధ్రప్రదేశ్: మూడున్నరేళ్లలో సిఎం చంద్రబాబు నాయుడు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.  నంద్యాలలలోని గోస్పాడులో శనివారం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  మూడున్నరేళ్లలో చంద్రబాబు నంద్యాలలో కనబడలేదని, ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి నంద్యాల గుర్తుకొచ్చిందని దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్‌సిపి పోటీని తట్టుకోలేక చంద్రబాబు మంత్రివర్గమంతా నంద్యాలలోనే తిష్టవేసిందన్నారు. పోలీసులతో ప్రజలను టిడిపి నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకులు ఎవరైనా మాట తప్పితే ప్రజలు కాలర్‌ పట్టుకొని అడగండన్నారు.  ఎన్నికలు రావడంతో చంద్రబాబు జివొల మీద జివొలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఐదు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. అది ఏమైందని ప్రశ్నించారు. ఇప్పుడు మిర్చి పంట నడిరోడ్డుపై రైతులు తగలబెట్టే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. బాబు రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబు రావాలంటే బాబు రావాలని టిడిపి నేతలు పిలుపునిచ్చారని, లేదంటే రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. ఇప్పుడు ఏమైందని, ఈ విధంగా చూస్తే ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.76 వేలు బాకీపడ్డారని మండిపడ్డారు. బాబు మూడన్నరేళ్లలో ఒక్క ఇల్లు అయినా కట్టించారా ? అని జగన్ ప్రశ్నించారు.

Comments

comments