Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

పరీక్షా కేంద్రం సిబ్బంది తప్పిదంతో నిలిచిన ఆర్‌ఆర్‌బి పరీక్ష

                        IBPS

నాచారం: హైదరాబాద్‌లోని మల్లాపూర్ నోమా కల్యాణ  వేదికహాల్‌లో ఐబిపిఎస్ వారి ఆధ్వర్యంలో రీజినల్ రూరల్ బ్యాంక్ యొక్క ప్రిలిమినరీ  పరీక్ష నిలిచిపోయింది. అభ్యర్థులను సూచించిన సమయానికి రాలేదన్న ఆరోపణలపై పరీక్ష కేంద్రంలోని నిర్వహకులు రానివ్వలేదు. దీంతో  గందరగోళం నెలకొంది. నోమా హాల్‌లో నిర్వహించిన (ఆర్‌ఆర్‌బి) బ్యాంక్  పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షా కేంద్రానికి సుమారు 2000 మంది విద్యార్థులు హాజరయ్యారు.

పరీక్ష నిర్వాహకులు ఇద్దరు సిబ్బంది ఉండడంతో విద్యార్థుల హాల్ టికెట్‌లను  వారి ఐడి ప్రూఫ్‌లను పరిశీలించడంలో ఆలస్యం  చెయ్యడంతో అనుమతించాల్సిన సమయం దాటిపోవడంతో చాలా మంది  విద్యార్థులను  లోనికి రానివ్వకుండా బయటికి పంపారు. దీంతో విద్యార్థులకు, సిబ్బందికి మధ్య గొడవమొదలైంది. పరీక్షలకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరవ్వడంతో  మల్లాపూర్ ప్రదాన రహదారిపై  వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో వాహనాదారులు తీవ్ర  ఇబ్బందులు  ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలిసులు రంగప్రవేశం  చేసి గొడవను కాస్తా  తగ్గించి పరీక్ష సిబ్బంది, నిర్వాహకులను నాచారం   పోలీస్ స్టేషన్‌కు  తరలించారు.  పరీక్షా కేంద్రం వద్ద  విద్యార్థులను అనుమతించడంలో సిబ్బంది తప్పు ఉందని, పరీక్ష రద్దుతో గొడవ సద్దుమణిగిందని మల్కాజ్‌గిరి ఎసిపి సందిప్ గోనే, నాచారం ఇన్‌స్పెక్టర్ విఠల్ రెడ్డి  తెలిపారు.

Comments

comments