Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

ఎర్రబెల్లి కాన్వాయ్‌కి ప్రమాదం

ERRABELLI

జనగామ : పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటన జనగామ జిల్లా దేవరుప్పల మండల పరిధిలో జరిగింది. కాన్వాయ్‌లోని ఓ కారు మరో కారును ఢీకొని చెరువులో బోల్తా పడ్డాయి. బతుకమ్మ చీరల పంపిణీ కోసం దేవరుప్పల మండలం కడవెండి నుంచి మాదాపురం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎస్కార్ట్ వాహన డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జిసిసి చైర్మన్ దరావత్ మోహన్‌గాంధీ నాయక్ ప్రయాణిస్తున్న కారు కూడా ప్రమాదానికి గురైంది. ఎర్రబెల్లి కాన్వాయ్ పెను ప్రమాదం నుంచి బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 Accident to Errabelli Convoy

Comments

comments