Search
Wednesday 18 October 2017
  • :
  • :
Latest News

మహేష్‌ విలన్‌గా విజయ్: విజయ్‌ విలన్‌గా మహేష్!?

Mahesh-Vijay-Muruga

హైదరాబాద్ : మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన ‘స్పైడర్’ చిత్రం విజయం తర్వాత దర్శకుడు ఎఆర్ మురుగదాస్ మరో క్రేజీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే తమిళంలో విజయ్ తో తుపాకి, కత్తి చిత్రాలు తీసిన మురుగదాస్, మరోసారి విజయ్ తో చిత్రాన్ని తీసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సినిమాలో మహేస్ బాబు విలన్ గా నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే చిత్రం తెలుగులో మహేష్ హీరోగా, విజయ్ విలన్ గా నటించనున్నారట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరోసారి ఓ మంచి సోషల్ మెసేజ్ తో కమర్షియల్ చిత్రాన్ని తెరకెక్కించడానికి మురుగదాస్ అడుగులు వేస్తున్నారు. అయితే ఈ చిత్ర కథని ఆయన ఇప్పటికే విజయ్, మహేష్ లతో చర్చించినట్లు సమాచారం. వారి నుంచి సమ్మతం వచ్చేందుకు దర్శకుడు ఎదురు చూస్తున్నాడట. మరీ ఈ రూమర్ నిజమవుతుందో లేదో వేచి చూడాల్సిందే.

Comments

comments