Search
Monday 19 February 2018
  • :
  • :
Latest News

ట్రాక్టర్ బోల్తా: ఇద్దరు మృతి

Tractor-Collision

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని జూలూరుపాడు మండలం సాయిరాం తండా వద్ద శనివారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. మరో 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో స్థానికులు వెంటనే గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

At least Two killed in Tractor Over roll in Bhadradri Kothagudem.

Comments

comments