Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

1133 కొలువులు

81 జూనియర్ కాలేజీల్లో మంజూరు

                       KCR

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభు త్వ జూనియర్ కళాశాలల్లో 1,133 పోస్టులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంజూరు చేశారు. అలాగే సర్వశిక్ష అభియాన్(ఎస్‌ఎస్‌ఎ), కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల  (కెజిబివి) బోధన, బోధనేతర ఉద్యోగుల గౌరవ వేతనాల పెం పుకు సిఎం ఆమోదం తెలిపారు. 2008 తర్వాత ప్రారంభమైన 81 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు   ప్రారంభంకాగా, ఆ కళాశాలలకు అప్పటి నుంచి పోస్టులు మంజూరు కాక కాంట్రాక్ట్ విధానంలో బోధన, బోధనేతర సిబ్బందితో నడుస్తున్నాయి. ఈ కళాశాలల్లో 1,133 పోస్టులు మంజూరు చేస్తూ సిఎం నిర్ణయం తీసుకున్నారు.
ఎస్‌ఎస్‌ఎ,కెజిబివి ఉద్యోగుల గౌరవ వేతనాలు పెంపు : ఎస్‌ఎస్‌ఎ, కెజిబివిలలో పనిచేస్తున్న సుమారు 11,839 మందికి గౌరవ వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎస్‌ఎస్‌ఎకు చెందిన 2,690 మంది పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల గౌరవ వేతనాన్ని రూ.6,000 నుంచి 9,000లకు పెంచారు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్‌కు రూ.11,400 నుంచి రూ.15,000లకు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లకు రూ.13 వేల నుంచి రూ.15 వేలకు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.12 వేల నుంచి 14 వేలకు, మెసెంజర్లకు రూ.8 వేల నుంచి 8,500లకు, సిస్టమ్ అనలిస్టులకు రూ.15 వేల నుంచి రూ.16,500లకు, సీరియర్ ప్రోగ్రామ్ టెక్నికల్ కన్సల్టెంట్‌కు రూ.35 వేల నుంచి రూ.40 వేలకు, కన్సల్టెంట్లకు రూ. 25 వేల నుంచి రూ.35 వేలకు, డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్లకు రూ.16,500 నుంచి రూ.17,500లకు, డ్రైవర్లకు రూ.13 వేల నుంచి రూ.15 వేలకు, అటెండర్లకు రూ.10 వేల నుంచి రూ.12 వేలకు వేతనాలు పెంచారు.

అలాగే కెజిబివిలలో 391 మంది స్పెషల్ ఆఫీసర్ల గౌరవ వేతనాన్ని రూ. 21 వేల నుంచి రూ.25 వేలకు, 2,737 మంది సిఆర్టీలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలకుచ 391 మంది అకౌంటెంట్లకు రూ.10 వేల నుంచి రూ.11 వేలకు, 391 మంది ఎఎన్‌ఎంలకు రూ.9 వేల నుంచి రూ.11 వేలకు, 391 మంది పిఇటిలకు రూ.11 వేల నుంచి రూ.12 వేలకు, 782 మంది ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్లకు రూ.5 వేల నుంచి రూ.6 వేలకు పెంచారు. సెల్ఫ్ ఫైనాన్స్ భారం నుంచి ఉర్దూ మీడియం సెక్షన్లకు విముక్తి : 15 ఉర్దూ మీడియం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కింద నడుస్తున్న 21 సెక్షన్లకు సంబంధించి 69 జూనియర్ లెక్చరర్ పోస్టులను సిఎం కెసిఆర్ మంజూరు చేశారు.

సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల విద్యార్థులపై ఆర్థిక భారం పడుతోందని, ఈ 15 కళాశాలలు సొంతంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు నడిపేందుకు అవసరమైన 69 పోస్టులకు సిఎం ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వం ఏటా రూ.1,86,30,000 భరించనుంది. కాంట్రాక్ట్ పద్దతిలో నియమించే ఒక్కో ఉర్దూ మీడియం జూనియర్ లెక్చరర్‌కు ఇక నుంచి రూ.27 వేల వేతనం అందనుంది. అలాగే 63 మంది పార్ట్‌టైం జూనియర్ లెక్చరర్ల వేతనాలు రెట్టింపు చేశారు. ప్రస్తుతం వీరికి ఒక్కో పీరియడ్‌కు రూ.150 చెల్లిస్తుండగా, దానిని రూ.300 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో పార్ట్‌టైం జూనియర్ లెక్చరర్ నెలకు 72 పీరియడ్‌ల చొప్పున గతంలో రూ.10,800 వేతనం పొందుతుండగా, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీరి వేతనం నెలకు రూ.21,600కు పెరిగింది. ఈ నిర్ణయం వల్ల ప్రభ్తుత్వంపై రూ.88,32,000 అదనపు భారం పడనుంది.

Comments

comments