Search
Friday 23 February 2018
  • :
  • :
Latest News

వాటర్‌ఫాల్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ దంపతులు

                 Collector

మన తెలంగాణ/ఆసిఫాబాద్ :  జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో  దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న వాటర్‌ఫాల్‌ను ఆదివారం కుమ్రం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ దంపతులు  గిరిజన ప్రజలతో కలిసి వాటర్‌ఫాల్ కేంద్రాన్ని పరిశీలించారు. మోవాడ్ గ్రామం నుండి 4 కిలోమీటర్ల దూరం కాలినడకన బయల్దేరి అక్కడి నుండి ఎడ్లబండిపై వాగు దాటుతూ సమితుల గుండం వాటర్‌ఫాల్ కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఇలాంటి వాటర్‌ఫాల్ కేంద్రం ఉండడం చాలా ఆనందమన్నారు.

దీనిని  పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వానికి నివేదికను పంపుతామన్నారు. అనంతరం గిరిజన గ్రామమైన బలాన్‌పూర్ గ్రామాన్ని సందర్శించి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అక్కడి చేరుతున్నాయా లేదాఅని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వీరి వెంట మోవాడ్ గ్రామ సర్పంచ్ తిరుపతి, గిరిజన ప్రజలు ఉన్నారు.

Comments

comments