Search
Thursday 22 February 2018
  • :
  • :

నడుస్తున్న బస్సులో కొట్టుకున్నారు! వీడియోతో సహా

TSRTCమహబూబ్ నగర్: వాళ్లిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు.. ఒకరు టిఎస్ఆర్టీసి మహిళా కండక్టర్ కాగా మరోకరు మహిళా పోలీస్ కానిస్టేబుల్. వారివారి విధుల నిర్వహణ విషయంలో వారిద్దరూ వాగ్వాదానికి దిగారు. తాను కానిస్టేబుల్ ననీ, డ్యూటీ డ్రెస్ లో ఉండగా టిక్కెట్ తీసుకోమని అడగవద్దని లేడీ కానిస్టేబుల్ గట్టిగా వాదించింది. దీంతో తానూ కండక్టర్ ననీ, టిక్కెట్లు జారీ చేయడం తన డ్యూటీయని లేడీ కండక్టర్ కూడా గట్టిగా వాదించింది. దీంతో ఆగ్రహానికి గురైన లేడీ కానిస్టేబుల్ కండక్టర్ పై పిగిగుద్దులేసెందుకు ప్రయత్నించింది. ఇది కాస్త ఘర్షణకు దారితీసింది.
వివరాల్లోకెళితే మహబూబ్ నగర్ నుండి నవాబుపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నవాబుపేట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ రజితకుమారి బస్సెక్కారు. ఆ బస్సులో శోభారాణి అనే మహిళ కండక్టర్ గా పని చేస్తున్నారు. టికెట్ తీసుకోవాలని అడగడంతో కానిస్టేబుల్ రజిత తన దగ్గరున్న ఉద్యోగ గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీని చూపించింది. దీంతో ఒరిజినల్ కార్డు చూపిస్తేనే తాను టికెట్ తీసుకోననీ, జిరాక్స్ కాపీని పరిగణించనని సదరు కండాక్టర్ చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్యాదం చోటు చేసుకుంది. తాను టికెట్ కొనే ప్రసక్తేలేదంటూ లేడీ కానిస్టేబుల్ భీష్మించుకు కూర్చింది. దీంతో బస్సు దిగి వెళ్లిపోవాటంటూ కండక్టర్ చెప్పడంతో కానిస్టేబుల్ కండక్టర్ పై చేయి చేసుకోని చితకబాదేసింది.

ఈ తతంగాన్ని బస్సులో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు తెలుగు నెటిజన్ల మధ్య వైరల్ గా మారడం విశేషం. కాగా, ఈ కేసు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి అక్కడనే పరిష్కారమైంది.

(వీడియో Sneha Tv సౌజన్యంతో)

Constable and Conductor were beaten in the running bus

Comments

comments