Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

నిబంధనలు తూచ్…

Wine-Shop

ఆదాయమే ధ్యేయంగా ఆబ్కారీ శాఖ
జనవాసాల మద్యే మద్యం దుకాణాలు
పెద్దమ్మ తల్లి ఆలయ సమీపంలోనే వైన్స్‌కు ఏర్పాటు

పాల్వంచ: ఆదాయమే ధ్యేయంగా ఆబ్కారీ శాఖ పనిచేస్తోంది. నిబంధనలను పక్కకు పెట్టి మందుబాబులకు ఇబ్బందులు కలుగకుండా చేరువలో ఉండే విధంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తున్నా ఆబ్కారీ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. జనవాసాల మధ్య మద్యం దుకాణాలకు అనుమతులిస్తున్నట్లు సమాచారం. నిబందనల ప్రకారం 100 మీటర్ల దూరంలో దేవాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు ఉండకూడదు. కానీ పట్టణ నడిబొడ్డున ఉన్నభజనమందిరానికి సమీపంలోనే రెండు వైన్‌షాపులకు అనుమతులిచ్చారు. దేవాలయం ప్రధాన ద్వారం నుంచి చుట్టూ తిప్పి 100 మీటర్ల పరిధి దాటినట్లు రికార్డులు చూపెట్టడంపై ఏ మేర వైన్‌షాపుల లైసెన్స్‌దారులకు అండగా ఆబ్కారీ శాఖ పనిచేస్తోందో అర్ధమౌతుంది. ప్రస్తుతం భజనమందిరం సమీపంలో ఉన్న దుకాణంతోనే మహిళలు, ప్రజలు, పిల్లలు ఇబ్బందులు పడుతుండగా మరో దుకాణాన్ని అదే రోడ్డులో ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నా అబ్కారీ అధికారులకు తెలియకపోవడం గమనార్హం.

కొత్తగా ఏర్పాటుచేస్తున్న దుకాణం సమీపంలో 100 అడుగుల దూరంలోనే మూడు వైద్యశాలలు సమీపంలోనే భజనమందిరం ఉన్నాయి. ప్రధాన మార్కెట్‌కు అనుసంధానమైన వీధి కావడంతో ఆ వీధి గుండా మహిళలు నిత్యావసరాలు, కూరగాయలు కొనేందుకు వెళ్తుంటారు. అదే వీధిలో పాఠశాలలు, కళాశాలల బస్సులు ఆగే ప్రదేశం ఉంది. దీంతో కళాశాలలకు వెళ్ళే విద్యార్థులు సైతం నిత్యం ఎదుర్కొంటున్నారు. సీతారామ భజనమందిరానికి వెళ్ళాలన్నా అదే ప్రధాన వీధి. ఇప్పటికే అక్కడు ఉన్న ఓ మద్యం దుకాణం రాత్రివేళలో మూసివేసే సమయంలో మద్యంబాబులు వీదుల్లోనే నిల్చోని మధ్యం సేవించడం పరిపాటిగా మారింది. రాత్రి వేళలో బయటకు రావాలంటేనే మహిళలు, పిల్లలు జంకుతున్నారు. అదేవీధిలో మరో దుకాణానికి అనుమతులివ్వడం వెనుక ఆదాయమే ప్రధామవధిగా ఆబ్కారీ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజల నుండి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నూతనంగా ఏర్పాటుచేసే దుకాణం అక్కడ ఏర్పాటుచేయ్యొద్దని ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు కలెక్టర్‌కు, సంబంధిత అధికారులకు వినతులు సమర్పిస్తున్నట్లు సమాచారం.

Comments

comments