Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

అధి’కార్ల’ కక్కుర్తి..!

Car

కనిపించని ట్యాక్సీప్లేట్ వెహికిల్స్..
బీనామి పేర్లతో సొంత వాహనాల వినియోగం..
తప్పుడు బిల్లులతో డబ్బులు తీసుకుంటున్న వైనం..
పట్టించుకోని ఉన్నతాధికారులు…

వనపర్తి ప్రతినిధి: కొందరు అధికారులు సొంత కార్లల్లో తిరుగుతూ అద్దెవాహనాల్లో పర్యటిస్తున్నట్లు తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారు. టాక్సీప్లేట్ వాహనాలనే వినియోగించాలన్న నిబంధనలను తుంగలో తొక్కేస్తు నెల నెలా బిల్లులు నొక్కేస్తున్నారు. సొంత పనులకు అద్దె వాహనాలను వినియోగించుకుంటూ సర్కారు ఖాతాలో రాస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించేందుకు అధికారులకు సరిపడా వాహనాలులేకపోవడంతో ప్రభుత్వం కార్లను అద్దెకు తీసుకునే వెసులుబాటు కల్పించింది. వాహనాల వినియోగానికి సంబంధించిన అద్దెను ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనిని కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. నిబంధలకు విరుద్దంగా సొంత కార్లను వినియోగిస్తున్నారు. జిల్లా అధికారులతో పాటు డివిజనల్ అధికారులు, తహశీల్దార్‌లు, ఎంపిడిఒలు, అద్దెవాహనాలు వాడుకునేందుకు అవకాశం ఉంది.

ట్యాక్సీప్లేట్ వాహనాలనే వాడాలి…
రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల్లో వినియోగిస్తున్న అద్దె వాహనాలకు ట్యాక్సీప్లేట్ ఉండాలని ,చాలా మంది ఈ నిబంధలను పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు స్వంత వాహనాలను బినామి పేర్లతో నడుపుతున్నారని ఆరోపించారు. ఎందరో నిరుద్యోగులు పని దొరక్క ఇబ్బంది పడుతుంటే ఉద్యోగాల్లో ఉన్నవారు ఓన్‌ప్లేట్ వాహనాలను అద్దె అధికార్ల కక్కుర్తి… కు పెట్టుకుని వారికి ఉపాధి లభించకుండా చేస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కిరాయికి నడుపుకొనేందుకు ట్యాక్సీప్లేట్ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని కోరారు. తిరిగేది తక్కువే..టాక్సీప్లేట్ ఉన్న వాహనాల్లో నెలలో 2,500 మీటర్లు పర్యటించాలల్సి ఉంటుంది. సొంత వాహనాల్లో తిరిగే అధికారులు ఈ నిబంధనను పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు మాత్రమే పర్యటిస్తూ రికార్డుల్లో మాత్రం పూర్తిస్థాయిలో పర్యటించినట్లు పేర్కొంటు బిల్లులు నొక్కేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొందరు అధికారులు మాత్రమే మారుమూల గ్రామాలకు వెళ్లి వస్తుండగా. చాలా మంది సొంత వాహనాలున్నవాళ్లు అప్పుడప్పుడు మాత్రమే గ్రామాలకు వెళ్తున్నారు. అధికారిక పర్యటనలకు వాడుకోవాల్సిన కార్లను కొందరు అధికారులు సొంతానికే ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. చాలా మంది అధికారులు వనపర్తి నుండి హైద్రాబాద్, మహబూబ్‌నగర్, మరికొందరు వనపర్తి నుండి హైద్రాబాద్, మహబూబ్‌నగర్‌కు రాకపోకలు కొనసాగిస్తుంటారు. రావడానికి , వెళ్లడానికి వాడుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

సగానికి పైగా సొంత కార్లే..
అద్దెకు తీసుకునే కార్లు ట్యాక్సీ ప్లేట్ అయి ఉండాలన్న నిబంధన అమలు కావడం లేదు. అధికారులు చాలా మంది తమ సొంత కార్లనే అద్దె కార్లుగా వాడుకుంటున్నారు. కొందరు అధికారులైతే డ్రైవర్లను కూడా పెట్టుకోకుండా సొంతంగా వాహనాన్ని నడుపుకుంటున్నారు. మండల,డివిజన్, స్థాయిలల్లో పని చేసే అధికారుల వద్ద ఓన్ ప్లేట్ వాహనాలే ఉన్నాయి.

Comments

comments