Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

నా ఊరికి.. నావంతుగా…

Advocat-Prakash-Reddy

అమరచింత: అమరచింత పట్టణాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్‌రెడ్డి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని కలెక్టర్ శ్వేతామహంతి పేర్కొన్నారు. బుధవారం అమరచింత మండల కేంద్రంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రకాష్‌రెడ్డి కస్తూర్బాపాఠశాలకు, గిరిజన పాఠశాలకు ప్రకాష్‌రెడ్డి 10 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. ఇచ్చిన స్థలాన్ని ప్రకాష్‌రెడ్డితో కలిసి కలెక్టర్ శ్వేతామహంతి స్థలాన్ని పరిశీలించారు. గతంలో హైకోర్టు న్యాయవాదిగా ఉన్న ప్రకాష్‌రెడ్డి మోడల్ స్కూల్ మంజూరు కాగా పాఠశాలకు 10ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. మోడల్ స్కూల్ మంజూరు కాకపోవడంతో మండల కేంద్రానికి కొత్తగా మంజూరైన కస్తూర్బా పాఠశాలకు 5 ఎకరాలు, గిరిజన పాఠశాలకు 5 ఎకరాల స్థలం ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారు.

పామిరెడ్డిపల్లి శివారులో గల 10 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ శ్వేతామహంతి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ డిఎంఆర్‌ఎం పాఠశాలను సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ జన్మనిచ్చిన అమరచింత పట్టణానికి ప్రకాష్‌రెడ్డి కోట్ల రూపాయల ఖర్చుతో విద్య, వైద్యం, గ్రామానికి తాగునీరు అందించడం అభినందనీయమన్నారు. కార్పొరేట్ స్థాయిలో పాఠశాల, వైద్యశాల నిర్మించి చెరువును రూ.30లక్షలతో పూడిక తీయించి, మరుగుదొడ్లను నిర్మించడంలో ఆయన గ్రామాన్ని ఎంతగానో అభిమానాన్ని చూపుతున్నారన్నారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అయిన తర్వాత స్వంతగ్రామానికి విద్య కోసం ఆయన ఎంత తపన పడుతున్నారో అర్థమౌతుందన్నారు. ప్రకాష్‌రెడ్డిలాంటి వ్యక్తి ప్రతి ఊరిలో ఒకరుంటే గ్రామం, మండలం, జిల్లాలు అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు.

అమరచింతను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్‌రెడ్డి..
రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ జన్మనిచ్చిన అమరచింత గ్రామానికి ఎంత చేసినా తక్కువేనని ఆయన పేర్కొన్నారు. మండలానికి మంజూరైన కస్తూర్బా పాఠశాల అద్దెభవనంలో కొనసాగుతుండడంతో తను ఈ 10 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానన్నారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ చంద్రారెడ్డి,తహసీల్దార్ దత్తాత్రి , ఎంపిపి శ్రీధర్‌గౌడ్, ఎంపిడిఒ పుష్పలీల, ప్రత్యేకాధికారి బాలకృష్ణ, సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, లిఫ్ట్ అధ్యక్షురాలు సౌజన్యారెడ్డి, సిఐ శంకర్ ఎస్‌ఐ సత్యనారాయణరెడ్డి,విర్‌ఒ నాగిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, గ్రామ పెద్దలు నాగభూషణం గౌడ్,తాటికొండ రమేష్, కలాంపాషా,గోపి, మహమూద్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు .

Comments

comments