Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

భార్యను చంపి ఆత్మహత్యా యత్నం

ఆటోలో పిల్లల ముందే దారుణం
వేములవాడలో ఘటన

                     Wife-and-Husband


వేములవాడ: కుటుంబ కలహాలు, అనుమానంతో భార్య గొంతుకోసి హత్యచేసి, తానుకూడా ఆత్మహత్యకు యత్నించిన ఘటన సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ పట్టణంలోని ఉప్పుగడ్డ మసీదు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వేములవాడ పట్ట ణం ఉప్పుగడ్డ మసీదు  గల్లీకి చెందిన చింతలఠాణం నర్సయ్య, నర్సవ్వల కుమార్తె అంజలి (22)కి ఆరు సంవత్సరాల క్రితం జగిత్యాల జిల్లా మల్యాల మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పోచంపల్లి రవి (28)తో వివాహం జరిగింది. జీవనోపాధి నిమిత్తం రవి దుబాయికి వలసవెళ్లాడు. వీరికి వర్షిత, అనిల్, సాయి అనే ముగ్గురు చిన్నారులు ఉన్నారు. రవి నెల రోజుల క్రితమే దుబాయి నుండి వచ్చాడు. ఇప్పటి నుండి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా అంజలిని పుట్టింటికి తీసుకువస్తూ, వేములవాడలోని ఆమె ఇంటికి సమీపంలో ఆటోలోనే కత్తితో ఆమె గొంతుకోసి చంపాడు. ఆ తరువాత తాను కూడా గొంతుకోసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న రవిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అంజలి మృతదేహాన్ని పరిశీలించి, దర్యాప్తును ప్రారంభించారు.

Comments

comments