Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

బకాయి ఉందా.. బీ కేర్‌ఫుల్…

People-in-Bank

సిబిల్ స్కోర్ ఇట్టే పట్టిస్తుంది..
భవిష్యత్‌లో రుణం పొందే అవకాశం హుష్..
ఎంత చిన్న మొత్తం బకాయి ఉన్నా ఇక అంతే..
మొండి బకాయి దారులకు ముకుతాడు వేసేందుకే..

వనపర్తి ప్రతినిధి: ప్రతి నెలా సక్రమంగా రుణ వాయిదాలు చెల్లించడం లేదా.. పై నెలలో చెల్లిద్దాంలే అనుకుంటున్నారా.. డబ్బులు ఉన్నా సమయం లేదని ఒకింత నిర్లక్ష్యం చేస్తున్నారా, తస్మాత్ జాగ్రత్త. ఇలా చేస్తే ఇక మీకు భవిష్యత్‌లో అప్పు పుట్టే అవకాశం లేనట్లే. ఎందుకంటే సిబిల్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ అనే వెబ్‌సైట్ లో ఈ విషయం నిక్షప్తమౌతుంది. ఇప్పుడు బ్యాంక్‌లు కార్పొరేట్ కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు,షోరూంలు, ఇలా ప్రతి ఒక్కటి ఈ సిబిల్ స్కోర్ చూసే రుణాలు ఇస్తున్నాయి. ఇందులో మీ స్కోర్ తక్కువగా ఉంటే ఏ సంస్థ అయినా సరే మిమ్మల్ని అనర్హులుగా పేర్కొంటూ రుణం ఇచ్చేందుకు నిరాకరిస్తుంది. రమేష్ అనే ఓ వ్యక్తి రెండేళ్ల క్రితం కారు కొన్నాడనుకుందాం. ఆ సమయంలో 36 వాయిదాలు చెల్లించేలా రుణం తీసుకున్నాడు. దాదాపు 22 నెలలు రుణం సక్రమంగా చెల్లించాడు. నెల క్రితం ఇబ్బంది రా వడంతో నెల వాయిదాలు చెల్లించలేదు. దాన్ని చెల్లించేందుకు అని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో కొత్త రుణం కోసం దరఖాస్తు చేశాడు. అన్ని పరిశీలించిన బ్యాంక్ వారు రుణం ఇస్తాం రమన్నారు. తీరా అక్కడికి వెళ్లితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది. మీరు బకాయి రుణాలు ఉన్నారు. మీకు రుణం ఇవ్వమని తేల్చి చెప్పారు. అదేంటని రమేష్ ప్రశ్నిస్తే మేం ఏం చేయలేం. అంతా సిబిల్ మహిమ అని ఆ బ్యాంక్ సిబ్బంది బదులిచ్చారు. అంతే ఎంత నికార్సుగా రుణం చెల్లిస్తున్నా ఒక వాయిదా చెల్లించకుంటే సిబిల్ వెబ్ లో మీరు మొండి బకాయిదారులు గానే కనిపిస్తారు. కనుక తస్మాత్ జాగ్రత్త రుణాల వాయిదాల ఏ మాత్రం నిర్లక్షంగా ఉండకండి.

స్కోర్ పట్టేస్తుంది ఇలా… మనం ఎప్పుడైనా అంటే బ్యాంక్‌లోనో,లేకుంటే షోరూంలోనే అవసరానికి లేదా వాహనం ,వస్తువు కొనేందుకు రుణం తీసుకుంటాం. ఆ సమయంలో వారు తప్పకుండా మన ఆధార్‌కార్డు, మనం తీసుకున్న రుణం మొత్తాన్ని నమోదు చేసుకుంటాం. దాన్ని ఓ వెబ్‌సైట్ కు లిం క్‌చేస్తారు. అలా లింక్ చేసే వెబ్‌సైట్ పేరే సిబిల్ స్కోర్. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దీన్నిఅందు బాటులోకి తీసుకువచ్చింది. రుణ ఎగవేత దారుల నుండి బ్యాంక్‌లను కాపాడాలన్నా ఉద్దేశ్యంతో తీసుకువచ్చిన ఈ వెబ్‌సైట్‌ను ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు సైతం ఉపయోగించుకుంటున్నాయి. రుణం కోసం వచ్చిన వారి వివరాలు ఇందులో నమోదు చేసి వారి క్రెడిట్ స్కోర్ చూసిన తర్వాత మాత్రమే రుణం ఇస్తున్నాయి. ఇందులో ఏ మాత్రం తేడావచ్చినా నిర్మోహమాటంగా రుణం తిర స్కరిస్తున్నాయి.

సిబల్ ఇక్కట్లు అంతే… మనం తీసుకున్న రుణం ఎంత, మన ఆదాయం ఎంత, మనకు ఎంత వర కు రుణం ఇవ్వవచ్చు అనే వివరాలు మొత్తం ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయి. మనం ఏ బ్యాంక్‌కో, ఏ సంస్థకో రుణం కోసంవెళ్తే ముందుగా వారు మన ఆధార్, పాన్‌కార్డు వంటివి తీసుకుంటారు. ఈ రెండింటిలో ఏ కార్డు సంఖ్య అయినా సరే సిబిల్ స్కోర్ వెబ్‌సైట్ నమోదు చేస్తే అందులో మన వివరాలు కనిపిస్తాయి. గతంలో మనకు రుణం ఉంటే ఎంత రుణం ఉంది. ఎంత బకాయి ఉంది. వాయిదాలు సక్రమంగా చెల్లిస్తున్నది లేనిది కనిపిస్తుంది. దాన్ని బట్టి మనకుఆయా సంస్థలు రుణం మంజూరు చేస్తాయి. అంతకు ముందు అందులో ఏ రుణం తీసుకోనట్లు ఉంటే కొత్తగా తీసుకొనే వారికి ఎలాంటి సమస్య ఉండదు. అలా కాకుండా గతంలో రుణం తీసుకొని ఉంటే మాత్రం కొత్త రుణానికి కష్టాలు మొదలైనట్లు లెక్క గతంలో తీసుకున్న రుణంకు మన ఆదాయానికి లెక్కగడ తారు. ఆపై రుణం తీసుకునేందుకు అర్హత ఉంటేనే కొత్తగా రుణం ఇస్తారు. లేదంటే లేదని కరా ఖండిగా చెబుతారు. ఇకెందుకు బకాయిలచెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మరి.

Comments

comments