Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

కౌలాలంపూర్‌లో జగిత్యాలవాసి మృతి

Dead-Body

కౌలాలంపూర్: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల గ్రామానికి చెందిన బోదాసు లక్ష్మణ్ (37) మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతి మలేషియాలోని ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరిపి మృతదేహాన్ని ఈ ఆదివారం ఎమ్‌హెచ్198 విమానంలో హైదరాబాద్‌కు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకుదెరువు కోసం మలేషియా వచ్చిన కొన్ని రోజుల్లోనే లక్ష్మణ్ ఆరోగ్యం క్షీణించి గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. కాగా లక్ష్మణ్‌కు కూతురు, కొడుకు ఉన్నారు. లక్ష్మణ్ మరణంతో కుటుంబ పెద్దని కోల్పోయి ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థిలో పడిపోయింది.

Comments

comments