Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

సింగరేణిలో కొలువులు

Singareni

750 ఖాళీల భర్తీకి నిర్ణయం
107 ఎగ్జిక్యూటివ్, 643 కార్మిక ఉద్యోగాలు, నేడు నోటిఫికేషన్

హైదరాబాద్: సింగరేణిలో 750 ఖాళీల భర్తీకి సెప్టెంబరు 23న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇందులో కార్మిక హోదాలో 643 పోస్టులు కాగా, మిగిలిన 107 ఎగ్జిక్యూటివ్ పోస్టులు. తాజా నోటిఫికేషన్‌తో కలిపి గత రెండేళ్ల నుంచి 7198 పోస్టులు మంజూరు చేసామని సింగరేణి సిఎండి శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత రెండేళ్లలో 5783 కొత్త ఉద్యోగాలు కల్పించగా, తాజాగా 750 ఉద్యోగాలు, 665 ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులతో కలిపి 7,198 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసినట్లయిందని వివరించారు. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అక్టోబరు 10, సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేయాలని గడువు విధించారు. మిగతా విషయాలను వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు. కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే ఉద్యోగాల వివరాలిలా ఉన్నాయి.

కార్మిక శ్రేణిలో….
ఉద్యోగం పేరు                                      పోస్టుల సంఖ్య
1. ఫిట్టర్ ట్రైనీ                                             288
2. ఎలక్ట్రికల్ ట్రైనీ                                        143
3. అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ                           69
4. టర్నర్, మెషినిస్టు ట్రైనీ                             51
5. సబ్ ఓవర్‌సీస్ ట్రైనీ (సివిల్)                      35
6. అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్)                 24
7. మౌల్డర్ ట్రైనీ                                            24
8. మోటార్ మెకానిక్ ట్రైనీ                            08
9. మెల్టర్                                                    01

అధికార పోస్టులివే…
1. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇ, ఎం)                      68
2. మేనేజ్‌మెంట్ ట్రైనీ (మైనింగ్)                    37
3. మేనేజ్‌మెంట్ ట్రైనీ (హైడ్రో జియాలజిస్టు)    01
4. మేనేజ్‌మెంట్ ట్రైనీ (జియో ఫిజిస్టు)           01

Comments

comments