Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

భూమాయలో… రక్షించే యత్నం

నగుబాటుకానున్న చట్టం
కాంట్రాక్టర్ ఇచ్చిందెంత? రైతుకు చేరిందెంత?
ఇచ్చినడబ్బు లేదా మరో భూమికై చర్చలు
ఫిర్యాదుపై కదలని  యంత్రాంగం?

Land-Mafia

 

 

మనతెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నంది వడ్డెమాను భూమాయ గాల్లు తాము చేసిన జాదూగార్ పని నుండి బయట పడేందుకు గుట్టు చప్పుడు కాకుండా తతంగం నడిపిస్తున్న ట్లు తెల్సింది. భూబాగోతం బయట పడి నెలలు గడుస్తున్నా పాలకులుగానీ , ప్రభుత్వ యం త్రాంగం గానీ తమకేమీ తెలియనట్లు మొద్దు నిద్ర నటిస్తుందన్న ఆరోపణలున్నాయి.  ఈ భూమాయలో హస్తం ఉన్న బడా బాబులు తమ పరపతి ఉపయోగించి  విచారణకు అడ్డుప డుతున్నట్లు ఆరోపణలున్నాయి.  దీన్ని  ఆసరా చేసుకుని  లోలోపలే పరస్పర అంగీకారంతో వివాదానికి తెరదించేందుకు ప్రణాళికలు రూపొందించుకుని కార్యాచరణ అమలు చేస్తున్న ట్లు తెలిసింది.

ఆ విషయంలో  భూములు లేకున్నా దర్జాగా తప్పుడు రికార్డులతోనూ , అసలు రైతులకు తెలియ కుండా బినామీ వ్యక్తులతోనూ, చనిపోయిన వారి స్థానంలో కొత్త ముఖాల ను చూపించి రిజిస్ట్రీ చేయించిన విషయం తెల్సుకున్న కాం ట్రాక్టర్ తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయం తో దళారీపై వత్తిడి తెచ్చినట్లు తెల్సింది. విషయాన్ని బయ టకు పొక్కకుండా ఎక్కడి కక్కడ మేనేజ్ చేస్తూ రావడమే గాక తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వారిని లీగల్ నోటీసులు ఇతరత్రా పేరుతో బెదిరించి తను రైతులకు చెల్లించిన డ బ్బును తిరిగి రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెల్సిం ది. ఇక తమ బండారం బయట పడకుండా ఉండేందుకు దళారులు సైతం రైతులతో ఎలాగైనా డబ్బు తిరిగి కాంట్రా క్టర్‌కు ఇప్పించడం లేదా అదే విలువైన ఇతర భూమిని కాంట్రాక్టర్‌కు రిజిస్ట్రేషన్ చేయించే యత్నాల్లో ఉన్నట్లు తెల్సింది.

తిరగ బడుతున్న రైతులు

చెర్వులో మునిగిపోయే భూమి ఉంటే ఎంత? పోతే ఎంత అనుకుని కొందరు , ఉన్నదానికి అదనంగా రికార్డులు సృ ష్టించి మరికొందరు ఎన్నొ తప్పుడు విధానాలతో దళారుల మాటలు నమ్మి రిజిస్ట్రేషన్ చేయించిన రైతులు తిరిగి డబ్బు ఇచ్చే విషయంలో కొందరు ససేమిరా అంటున్నట్లు తె ల్సింది. ఇంకొందరు రైతులు ఏకంగా తనకు ఇవ్వాల్సిన డ బ్బులు ఇవ్వకుండా దళారులు తినేసారంటూ ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేయడం తో కథ అడ్డం తిరిగింది. తనకు డబ్బులు ఇవ్వలేదంటూ ఫిర్యాదు చేసిన వ్యక్తికి అస లు అంత భూమే లేదని, ఎక్కడుందో చూపించ మంటే చె ర్వులో నీరుంది ఎండిన తర్వాత చూపిస్తా ముందు డబ్బు ఇవ్వమని అంటున్నట్లు తెల్సింది.

లేని భూమికి డబ్బు ఎలా ఇస్తాం అంటూ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకుండా పెండింగ్ పెట్టారని కూడా తెల్సింది. ఇక మరి కొందరు రైతులు అసలు మాతో బలవంతంగా ఇలాంటి తప్పుడు పనులు చేయించారు. మాపై చర్యతీసుకోవాలంటే ముం దు దళారుల సంగతి తేల్చిన తర్వాతే నంటూ డబ్బులు తిరిగి ఇవ్వడానికి ససేమిరా అంటున్నట్లు తెల్సింది. ఇదే గాక పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న వెంక టాద్రి రిజర్వాయర్‌కు అవసరమైన నల్లమట్టి కోసం కొను గోలు చేస్తున్న భూముల కొనుగోలులో చెల్లిస్తున్న ధరల్లో కూడా తేడా ఉండటాన్ని నంది వడ్డె మాను రైతులు ప్రశ్ని స్తున్నారు.పరిసర గ్రామాల చెర్వు శికం భూములు ఎకరా రూ.5లక్షల50వేలకు పైగా ధర చెల్లిస్తే తమకు మాత్రం కేవలం రూ.280లక్షలు మాత్రమే చెల్లించారని అంటున్నా రు. మిగతా సగం డబ్బు ఎవరి ఖాతాకు వెళ్లా యి? దళా రుల జేబుల్లోకా? కాంట్రాక్టర్ ఖాతాలోకా అం టూ కూడా ప్రశ్నిస్తున్నారు.

విచారణను అడ్డుకుంటున్నది పెద్దలేనా?

నంది వడ్డెమాను శికం భూమాయలో విచారణ కాకుండా అడ్డుకుంటున్నది దళారులు వారి వెనక ఉండే బడా బాబులే నన్న ఆరోపణలున్నాయి. దాదాపు ఏడాది క్రితం జరిగిన ఈ కుంభకోణం గురించిన సమాచారం ఆరు నెల ల క్రితమే వెలుగు చూసింది. దీనిపై కొందరు ఆర్టీఐ క్రింద సమాచారం సేకరించారుకూడా . ఆ సమాచారం ఆధా రంగా దాదాపు ఐదునెలల క్రితం జిల్లా ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెల్సింది.నెలలు గడుస్తున్నా ఇంత దారుణ మోసంపై యంత్రాంగం కదిలిన దాఖలాలు కనిపించడంలేదని అంటున్నారు. జరిగిన పొరపాటు సర్దుబాటు చేస్తారని విచారణలో తొందర వద్దని లోపా యికారి వత్తిడుల వల్లే విచారణ దిశగా అడుగులు పడ టం లేదన్న ఆరోపణలున్నాయి.

దళారుల మాటలు నమ్మి మోస పోయిన కాంట్రాక్టర్ ఎలాగోలా తన డబ్బు వస్తే చాలు ఎవరితో గొడవెందుకు అన్న ఆలోచనలో ఉన్నట్లు ,మోసపోయిన కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయలేదన్న సాకుతో విచారణను అటకెక్కించ వచ్చన్న ఆలోచనతో పెద్దలు జాప్యం చేయిస్తున్నట్లు సమాచారం.
చట్టం నగుబాటు కానుందా?

వ్యక్తి గత అంశాలపై జరిగే నేరాలలో పరస్పర అంగీకారం తో రాజీ కావడం సహజం. నంది వడ్డమాను భూమాయను కూడా వ్యక్తి గత అంశంగా పరిగణిస్తూ చేసుకుంటున్న రాజీ యత్నాలు చట్టాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయన్న భావన సర్వత్రావ్యక్త మవుతున్నది. కేవలం ఇద్దరు వ్యక్తుల లావాదేవీలయినా ఇందులో ప్రభుత్వ అధికారులు చేసిన గారడీ చట్టాన్ని మసి బూసి మారెడుకాయ చేయడం తీవ్ర మైన అంశంగా పరిగణించాల్సి ఉందంటున్నారు. ముఖ్యం గా ప్రజా ధనంతో వేతనాలు తీసుకుంటూ చట్ట పరిధిలో నడుచుకోవాల్సిన రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారు లు, ఉద్యోగులు చేసిన తప్పుడు పని వ్యక్తులనే గాక చట్టా న్ని ,వ్యవస్థనే చీట్ చేశారన్నది బహిరంగ రహస్యం దీనిపై విచారణ జరపకుండా చర్యలు తీసుకోకుండా కప్పి పుచ్చి తే చట్టం నగుబాటు కాగలదన్న వాదనలు వెలువడు తున్నాయి.

Comments

comments