Search
Friday 23 February 2018
  • :
  • :
Latest News

వేములవాడలో దారుణం…

Couple-Suicide

రాజన్న సిరిసిల్ల: జిల్లా వేములవాడలో దారుణ ఘటన జరిగింది. భార్యను నడిరోడ్డుపై గొంతుకోసి హత్య చేశాడో భర్త. అనంతరం అదే కత్తితో తాను గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్ననానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థిత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బాలరాజు, వసంతలకు ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. అయితే మంగళవారం వేములవాడలో బాలరాజు పిల్లల ఎదుటే భార్యపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు.

అతి కిరాతకంగా ఆమె గొంతుకోసి హతమార్చాడు. అనంతరం బాలరాజు అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న బాలరాజును సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. కాగా, కుటుంబ కలహాలతోనే బాలరాజు ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Man brutally kills Wife and attempt Suicide in Vemulawada.

Comments

comments