Search
Thursday 22 February 2018
  • :
  • :
Latest News

కృష్ణానది నాడు గలగల నేడు వెళవెళ..

                 krishna-River

మన తెలంగాణ/కొల్లాపూర్: కొల్లాపూర్ తాలుక కేంద్రానికి 9కిలో మీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది గత ఏడాది ఆగష్టు మాసంలో నది నిండా నీరు చేరి చూడ ముచ్చటగా కృష్ణమ్మ పరుగులేసింది.గత సంవత్సరం 12నుండి పుష్కరాలు ప్రారంభమైనవి అప్పటికి కృష్ణానదిలో పూర్తి స్థాయిలో నీరు ఉండటంతో పుష్కరాలు విజయవంతమైనవి. ఈఏడాది అందుకు భిన్నంగా కృష్ణమ్మ బిత్తరపోయి చూస్తుంది. నేటికి చిన్నపాయకూడా నిండలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మత్సకారులు, మరోవైపు రైతులు కృష్ణానదిలో నీరు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ నెల ప్రారంభమైన నేటికి నదిలో నీరు రాకపోవడంతో ఆందోళనతో ఆశతో కృష్ణమ్మ వైపు ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం అల్‌మట్టి ప్రాజెక్టు నిండటంతో నీటిని వదిలినట్లు సమాచారం.జూరాల ప్రాజెక్టు నిండి దిగువన ఉన్న కృష్ణానదికి నీరు రావాలి.ఇప్పటికైన కృష్ణమ్మ నిండితే తమకు బతుకుదేరువు ఉంటుందని మత్సకారులు, రైతులు చర్చించుకుంటున్నారు.

Comments

comments