Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

వామ్మో.. సర్కారు దవాఖానా?

PHC

ప్రసవం చేయించుకునేందుకు జంకుతున్న గర్భిణులు
సకల వసతులు కల్పిస్తున్నా ప్రైవేటుకే పరుగులు
ప్రచారలేమియే కారణమంటున్న ప్రజలు

గుండాల: ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా సర్కారీ దవాఖానాల్లో వైద్యం అందిస్తామని ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా అధికారుల ప్రచారలేమితో రోగులెవరూ ఆస్పత్రులకు వెళ్లడం లేదు. జనగామ జిల్లా గుండాల ప్రభుత్వ వైద్యశాల ఈ కోవలోకే చెందుతోంది. ప్రతి వారం రెండుసార్లు గర్భిణులకు వైద్య పరీక్షలు అందిస్తున్నారు. అయినా మూడు నెలలుగా ఏ ఒక్కరూ ఇక్కడి ఆస్పత్రిలో డెలివరీ చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ వైద్యశాలలో 20 మంది ఆశావర్కర్లు, 9మంది ఏఎన్‌ఎం లు, ముగ్గురు సూపర్‌వైజర్లు వైద్యం అందిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టిన ప్రజల్లో ప్రచారం చేయకపోవడంతోనే ఎవరూ ప్రభు త్వాస్పత్రుల వైపు చూడడం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రభుత్వాస్ప త్రుల్లో ప్రసూతి అయ్యేలా మహిళలను ప్రోత్సహించాల్సి న అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.

Comments

comments