Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

తండా వాసుల హంగామా..పోలీసుల హై అలర్ట్

భర్త హత్యకేసులో అనుమానితురాలిగా భార్య, సెల్ ఫోన్ ఆధారంగా కదులుతున్న డొంక?,చందుర్తి ఠాణాకు చేరిన డిఎస్‌పి చంద్రశేఖర్

                    clash

మనతెలంగాణ/రుద్రంగి: రుద్రంగి మండలం మానాల హామ్లెట్ గ్రామమైన అడ్డబోతు తండావాసుల హంగామాతో రుద్రంగి ఠాణా పోలీ సులు ఒక్కసారిగా హై అలర్ట్ అయ్యా రు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. అడ్డబోతు తండాకు చెందిన గుగులోతు రాజు (35) అనే వ్యక్తి మానాల గైరి గుట్ట తండాకు చెందిన మంజులను గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరివురికి సంతానం కలగకపోవడంతో మూడు నెలల క్రితం రాజి అనే యువతితో రాజుకు మరో వివాహం జరి గింది. వివాహం జరిగిన నెలరోజులకే గుగు లోతు రాజు కన్పించకపోవడంతో రుద్రంగి పోలీస్ స్టేషన్‌లో అతని తమ్ముడు గుగులోతు డాక్య ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో రాజు ద్విచక్ర వాహనం కమ్మరపల్లి మండలం బషీర్‌బాద్, చౌటపల్లి గుట్టల మధ్య కనబడింది. దీనితో రాజు మృతి చెంది ఉంటాడా.? లేక కిడ్నాప్ చేసి ఉంటారా..? అనే కోణంలో పోలీసులు అతని సెల్‌ఫోన్ ఆధారంగా దర్యాప్తును ప్రారం భించారు.

ఈ సెల్‌ఫోన్ రాజు మొదటి భార్య అయిన మంజుల చిన్నమ్మ కుమారుని వద్ద లభ్యమవడంతో అతడిని రుద్రంగి పోలీస్ స్టేషన్‌కు శుక్రవారం తీసుకువచ్చి విచారణ జరపారు. ఫోన్ తన అక్క మంజులనే ఇచ్చిందని అతను పోలీసులకు తెలుపడంతో పోలీసు లు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. శుక్రవారం రాత్రి కావడంతో ఇద్దరిని సొంత పూచీకత్తుపై పోలీసులు విడిచిపెట్టి శనివారం ఉదయం రావాలని ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న రాజు తమ్ముడు డాక్య అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. అక్కడ రాజు మొదటి భార్యను చూసి ఆవేశానికి లోనైన ఆమె వారు ఒక్కసారిగా దాడికి యత్నించారు. దాదాపు గంట పాటు సాగిన ఈ ఉద్రిక్త వాతావరణంతో పోలీసులంతా అప్రమత్తమై, ఇరువర్గాల వారిని శాంతింపచేశారు. వేములవాడ డిఎస్పీ అవధాని చంద్రశేఖర్ చందుర్తి ఠాణా చేరుకుని తండావాసులతోపాటు మంజులను సైతం పిలిపించుకుని, విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

Comments

comments