Search
Tuesday 19 June 2018
  • :
  • :

స్వచ్ఛమైన కల్లుకు కేరాఫ్..’అమరచింత’

Toddy

సిఎం పిలుపు మేరకు స్పందించిన గీతా కార్మికులు.
ఆదర్శంగా నిలుస్తున్న గౌడ సంఘం నాయకులు..
మత్తులేని కల్లుకు అలవాటు పడుతున్న కల్లుప్రియులు…
అమరచింత: కల్తీ కల్లును రూపుమాపాలని చెట్ల నుండి తీసిన స్వచ్ఛమైన కల్లును అమ్మాలని సిఎం కెసిఆర్ ఇచ్చిన పిలుపును వనపర్తి జిల్లా అమరచింత మండల గౌడ సంఘం నాయకులు పాటిస్తున్నారు. మూడు నెలల నుండి పట్టణంలో మత్తు పదార్థాలు కలపని (కల్తీలేని)కల్లును క్రయిస్తున్నారు. లాభలకంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యమని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు గీతాకార్మికులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కల్లు ప్రియులు మొదట్లో కల్లులో మత్తు కలుపలేదని దుకాణాల వద్ద గొడవలకు దిగారు. మత్తు కల్లు మండల కేంద్రంలో లభ్యం కాకపోవడంతో వేరే మండలం నుండి తెచ్చుకొని సేవిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన దళారులు మత్తు కల్లును తెచ్చి విక్రయిస్తున్నారు. స్వచ్ఛమైన కల్లుకు గిరాకీ తగ్గడంతో అక్రమంగా అమ్మేవారిని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. మత్తుకల్లు దూర ప్రాంతాల్లో దొరకడంతో అక్కడికి వెళ్లలేక మళ్లీ స్వచ్ఛమైన కల్లును సేవిస్తున్నారు. రెండు నెలల్లోనే క్రమేపి స్వచ్ఛమైన కల్లును సేవిస్తున్నారు. గీతా కార్మికుల నిర్ణయాన్ని పట్టణ ప్రజలు, కల్లు ప్రియులు అభినందిస్తున్నారు. కల్లు గీతా కార్మిక సంఘం నాయకులు నరసింహ్ములు గౌడ్ కృష్ణయ్యగౌడ్, తమ్మన్న గౌడ్‌లు మన తెలంగాణతో మాట్లాడుతూ రాత్రింబవళ్లు వాగులు, వంకల్లో కష్టపడి ఈత చెట్ల నుండి కల్లును తీసుకొని ఏ మాత్రం కల్తీ లేకుండా స్వచ్ఛమైన కల్లును విక్రయిస్తున్నామని గీతా కార్మికుల కు గౌడ సంఘం నాయకులు ఉపాధి కల్పిస్తున్నారు . మిగతా సంఘం నాయకులు కూడా కల్తీకల్లు కాకుండా స్వచ్ఛమైన కల్లును విక్రయించాలని వారు కోరారు.

స్వచ్ఛమైన కల్లును విక్రయించడం అభినందనీయం -శ్రీలన్‌గౌడ్,రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు
గత కొంత కాలంగా పట్టణంలో గీతా కార్మిక సంఘం కల్తీకల్లు కాకుండా స్వచ్ఛమైన కల్లును విక్రయించడం చాలా అభినందనీయం .వారికి మా సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడు అందజేస్తాం. మత్తు కల్లు తాగడం వల్ల మెదడులోనినరాలు దెబ్బతింటాయి. స్వచ్ఛమైన కల్లు వల్ల ఎలాంటి అనారోగ్యం ఉండదు. గీతా కార్మికులకు సహాయసహకారాలు ఎల్లప్పుడు ఉంటాయి. ఆదర్శంగా తీసుకొని కల్తీకల్లును విక్రయించకుండా స్వచ్ఛమైన కల్లును విక్రయించాలని ఆయన కోరారు.

స్వచ్ఛమైన కల్లును విక్రయిస్తున్నాం -లచ్చన్నగౌడ్, జిల్లా గౌడ సంఘం నాయకులు
మత్తు కల్లును నిషేదించినప్పుడు ప్రజల కష్టాలను చూసి చలించి పోయాం. సిఎం కెసిఆర్ పిలుపు మేరకు స్వచ్ఛమైన కల్లును విక్రయించడానికి నిర్ణయం తీసుకున్నాం. మత్తు కల్లును విక్రయించకుండా స్వచ్ఛమైన కల్లును విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు. మూడు నెలల నుండి స్వచ్ఛమైన కల్లును విక్రయిస్తున్నాం. సహాయ సహకారాలు వారి స్పూర్తితో ఇక ముందు కల్తీ కల్లు కాకుండా స్వచ్ఛమైన కల్లును విక్రయిస్తున్నాం.

Comments

comments