Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

‘రాజు గారి గది-2’ ట్రైలర్

Raju-Gari-Gadhi-2

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఓ.ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగారి గది-2’. అక్కినేని నాగేశ్వరరావు 98వ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఈ చిత్రం ట్రైలర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఓంకార్ దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, సీరత్‌కపూర్, నరేష్, అశ్విన్, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో నాగార్జున మెంటలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. సమంత ఆత్మగా కనిపించనుంది.

 ఈ చిత్రం ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయగా… ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ లో నాగ్ మానసిక వైద్యుడిగా అదరగొట్టాడు. బీచ్ రిసార్ట్ ముగ్గురు ఫ్రెండ్స్, ఆత్మ, మెంటలిస్ట్ ల మధ్య జరిగే హరర్ కామెడీ చిత్రంగా ‘రాజుగారి గది-2’ తెరకెక్కింది. అక్టోబర్ 13న ఈ మూవీ విడుదల కానుంది. హర్రర్ కే హర్రర్ లా ఉన్న ‘రాజు గారి గది-2’ ట్రైలర్ మీ కోసం…

Comments

comments