Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

‘స్పైడర్‌’ ట్రైలర్‌ విడుదల

Spyder

హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘స్పైడర్’. ఈ చిత్రం  ట్రైలర్‌ను మూవీ యూనిట్ శుక్రవారం ఉదయం విడుదల చేసింది. ప్రిన్స్ ఈ సినిమాలో ఇంటెలిజెన్స్‌ అధికారి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్‌ అధికారిగా మహేశ్‌ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇక ప్రిన్స్ పలికిన ‘నేను స్పైడర్‌మ్యానో, సూపర్‌మ్యానో కాదు. ఈ సొసైటీని ఛేంజ్‌ చేయట్లేదు’ అనే డైలాగ్ బాగుంది.

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హేరిస్ జయరాజ్ అందించిన సంగీతం కూడా అభిమానులను అలరిస్తుంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా జరుగనుంది. మహేశ్ కు జోడీగా తొలిసారిగా రకుల్‌ప్రీత్ సింగ్ నటించింది. మరో తమిళ దర్శకుడు ఎస్‌.జె సూర్య ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇంకేందుకు తాజాగా విడుదలైన ‘స్పైడర్‌’ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి.

Comments

comments