Search
Monday 11 December 2017
  • :
  • :

ఎస్‌ఐ ఫలితాలు

సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రధాన రాత పరీక్ష ఫలితాలు విడుదల
7 నుంచి 10 వరకు వెబ్‌సైట్‌లో వివరాలు

                   police-cap

హైదరాబాద్/ సిటీబ్యూరో: ఎస్‌ఐ ప్రధాన రాత పరీక్ష ఫలితాలు ఎట్టకేలకు శనివారం విడుదలయ్యాయి. మొత్తం 509 ఎస్‌ఐ పోస్టులకు ప్రాథమికంగా ఎం పికైన అభ్యర్థులు, కటాఫ్ మార్కుల వివరాలను రాష్ట్ర పోలీసు నియామక సంస్థ ప్రకటించింది. రాత్రి 8 గంటల నుంచి అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి మార్కులు తెలుసుకోవచ్చునని తెలిపింది. అభ్యంతరాలు ఉన్న వారు ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు వెబ్‌సైట్ (www.tslprb.in) ద్వారా సవాల్ చేయవచ్చునని నియామక సంస్థ పేర్కొంది. గతేడాది నవంబర్ 19, 20 తేదీల్లో ఎస్‌ఐ సివిల్ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. సివిల్, సాయుధ రి జర్వ్, ప్రత్యేక సాయుధ రిజర్వ్, టిఎస్‌ఎస్‌పి, అగ్నిమాపక శాఖ విభాగాల్లో మొత్తం 510 ఎస్‌ఐ ఉద్యోగా ల భర్తీ కోసం గతేడాది ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 19,20 తేదీల్లో ప్రధాన రాత పరీక్షకు 32,682 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయి తే కానిస్టేబుళ్ల ఎంపికపై వివాదాలు వచ్చిన నేపథ్యం లో ఎస్‌ఐ నియామక పరీక్ష ఫలితాలపై ఆచితూచి వ్యవహరించారు. వివిధ కోణాల్లో పరిశీలించి ఎట్టకేలకు పోలీ సు నియామక సంస్థ శనివారం పరీక్ష ఫలితాలను వెల్లడించింది. మొత్తం 510 పోస్టుల్లో 76 మంది మహిళ  లు సహా 509 మందిని ఎంపిక చేశారు. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులు, కటాఫ్ మార్కులను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు పోలీసు నియామక సంస్థ పేర్కొంది. అయితే వ్యక్తిత్వం, ధ్రువపత్రాలు, దస్త్రాల పరిశీలన, మెడికల్ ఫిట్ నెస్ తర్వాతనే తుది ఎంపిక జరుగుతుందని నియామక సంస్థ స్పష్టం చేసింది. అనుమానాలు ఉంటే ఛాలెంజ్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఒసి, బిసి అభ్యర్థులు రూ.5000, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులు 2000 చెల్లించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని వెల్లడించింది.

Comments

comments