Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

పిడుగుపాటుకు ముగ్గురు మృతి

Thunderbolt

వనపర్తి : పిడుగు పడి ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన బుధవారం ఉదయం ఖిల్లాఘనపురం మండలం మానాజిపేటలో జరిగింది. గ్రామ శివారులోని దర్గా వద్ద కందూరు పండుగ చేసేందుకు వెళ్లారు. దేవుడికి నైవేద్యం పెట్టేందుకు వంట చేస్తున్న సమయంలో వర్షం కురిసింది. తలదాచుకునేందుకు పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. ఈ సమయంలో చెట్టుపై పిడుగు పడింది. దీంతో చెట్టుకింద ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మానాజిపేటకు చెందిన కృష్ణయ్య (52), ఎండి సోహెల్ (7), జంగమాయపల్లెకు చెందిన సుంకర రాములు (55) చనిపోయారు. గాయపడిన వ్యక్తి మానాజిపేటకు చెందిన ఎండీ ఇమ్రాన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Three dead with Thunderbolt

Comments

comments