Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

మంత్రి సమక్షంలో టిఆర్‌ఎస్ తమ్ముళ్ల ఆధిపత్యపోరు

ఒకరిపై మరొకరు దూషణలు

                          Fight

మనతెలంగాణ/ గట్టు: రైతు సమన్వయ సమితి కమిటీల శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదుట స్థానిక టిఆర్‌ఎస్ నేతలు దూషణలు, అరుపులు, బాహాబాహీకి దిగిన సంఘటన ఆదివారం గట్టు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న రైతు సమన్వయ సమితి కమిటీలలో భాగంగా గట్టు మండల కేంద్రంలో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పంచా యతీ రాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.

కార్యక్రమం ముగిసిన అనంతరం టిఆర్‌ఎస్ సీనియర్ నేత గట్టు తిమ్మప్ప తన అనుచరులతో కలిసి మంత్రి ఎదుటనే తమకు జరుగుతున్న వివక్ష, అన్యాయా లపై గట్టిగా నిలదీశారు. ముఖ్యంగా రైతు సమన్వ సమితి కమిటీల ఏర్పాటులో తమను పక్కన పెట్టడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. స్థానికంగా ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ పార్టీని నాశనం చేస్తున్నాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసంఘటనతో కంగుతిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు నిశ్టేష్యుడైయ్యారు. ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న విలేకరులను తీయవద్దం టూ మంత్రి అడ్డు చెప్పారు. మొత్తానికి గద్వాలలో టిఆర్‌ఎస్‌లో చోటు చేసుకు న్న వర్గపోరుతో మరోసారి చర్చనీయంశయంగా మారింది.

Comments

comments