Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

Drown-Swimming

రాజన్న సిరిసిల్ల: జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల వద్ద బుధవారం విషాదం నెలకొంది. జిల్లెలలోని పెద్ద చెరువులో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదావశాత్తు అందులో పడి మృతిచెందారు. విద్యార్థుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహయంతో మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Comments

comments