Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదం.. రెండేళ్ల బాలుడు మృతి

Road-Accident

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని బోయినపల్లిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. బోయినపల్లి మండల పరిధిలోగల కుదురుపాక అడ్డరోడ్డులోని మానేరు ఫ్లాష్ బ్రిక్స్ తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తయారీ కేంద్రంలో పనిచేస్తున్న రాజు, తిరుమల దంపతుల కుమారుడు ఆపిల్(2) ఇసుక కుప్పలపై ఆడుకుంటూ టిప్పర్ వెనుక టైర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు, బంధువులు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే బాలుడు చనిపోయాడని ఆరోపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Two Year Old Boy died in Road Accident in Rajanna Siricilla.

Comments

comments