Search
Wednesday 23 May 2018
  • :
  • :

‘ఉంగరాల రాంబాబు’ ట్రైలర్‌ విడుదల

Sunil

హైదరాబాద్: సునీల్‌, మియాజార్జ్‌ జంటగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘ఉంగరాల రాంబాబు’. తాజాగా ఈ చిత్రం  ట్రైలర్‌ విడుదలైంది. దీనిలో సునీల్‌ ‘ఖైదీ నంబరు 150’ చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి డైలాగ్‌ … ‘ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా.. కాదని బలవంతం చేస్తే కోస్తా’ అనే డైలాగ్ తో ట్రైలర్‌ ప్రారంభమైంది. అలాగే ‘అన్నీ ఇండస్ట్రీల్లో ఉద్యోగాలకు కారణమైన వ్యవసాయాన్ని ప్రభుత్వం ఇండస్ట్రీగా ఎందుకు గుర్తించదు’ అని సునీల్ ప్రశ్నించే డైలాగ్ బాగుంది. వీటితో ప్రకాశ్ రాజ్ పలికిన కొన్ని డైలాగులు బాగున్నాయి. యూనైటెడ్ మూవీస్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు జిబ్రాన్ సంగీతం అందించాడు. ‘ఉంగరాల రాంబాబు’  సెప్టెంబరు 15న విడుదల కానుంది.

Comments

comments