Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

జూరాలకు జలకళ

JURALA-project

జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టుకు 28 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. లిఫ్టులు, కాలువలకు 6600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 9.377 టిఎంసిల నీరు ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టులో 12,023 క్యూసెక్కుల ఇఫ్లో ఉండగా, వచ్చే నీటిని మొత్తం దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌లో 11,350క్యూసెక్కుల ఇఫ్లో ఉండగా, 10,647 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా మహాత్మాగాంధఋ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రెండో లిఫ్ట్ పంప్‌హౌస్ వద్ద రెండు మోటార్లు ఆన్ చేసి 1600 క్యూసెక్కుల నీటిని జొన్నలగుడ రిజర్వాయర్‌ను నింపుతున్నారు. ఈ నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తామని అధికారులు చెప్పారు. సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువ నుంచి నాలుగు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, నాలుగు వేల క్యూసెక్కుల ఐట్‌ఫ్లో ఉందని అధికారులు తెలిపారు. ఓ గేటును సగం మేర ఎత్తి నీటిని వదిలినట్టు వారు వెల్లడించారు. జూరాల ప్రాజెక్టు జకళను సంతరించుకోవడంతో పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.

Water Flooding to Jurala Project

Comments

comments